రైలు కింద పడి మెడికల్ విద్యార్థికి గాయాలు

593చూసినవారు
రైలు కింద పడి మెడికల్ విద్యార్థికి గాయాలు
కడప రైల్వే స్టేషన్ లోని రెండో ప్లాట్ ఫామ్ వద్ద మంగళవారం మెడికల్ విద్యార్థిని రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి కాలు తెగిపోయింది. కడప వాసి అధిరా గుల్బర్గాలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. గుల్బర్గాకు వెళ్లేందుకు రైలు బయలు దేరుతుండగా ఆమె ఎక్కబోతూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఎడమకాలు తెగిపోయింది. ప్రయాణికులు చైను లాగి రైలును నిలిపి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్