కడప నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో మస్జిద్ వద్ద మంగళవారం నూతన రేషన్ షాప్ ను కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా అందుతున్న సబ్సిడీతో కూడిన నిత్యవసర సరుకులు నిరుపేదలకు అందాలని తెలిపారు. అనంతరం మహిళలు ఎమ్మెల్యే మాధవి రెడ్డిని ఘనంగా సత్కరించారు.