పెద్దదర్గాను దర్శించుకున్న ఎంపీ

63చూసినవారు
పెద్దదర్గాను దర్శించుకున్న ఎంపీ
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి గురువారం కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆయన దర్గాకు విచ్చేశారు. నిర్వాహకులు ఆయనకు సంప్ర దాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తొలుత ప్రధాన గురువుల మజార్ల వద్ద, అనంతరం ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మాజర్ల వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ముజావర్ అమీర్ ఆయనకు దర్గా విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్