కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఏడాది గడుస్తున్న ఇంతవరకు ఆ హామీల ఊసే కనిపించలేదని వైయస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వి. రామ్ లక్ష్మణ్ రెడ్డి, అన్నారు. బుధవారం వైసిపి కార్యాలయంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి వీటి పై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో నిరాశ, అసంతృప్తి ఉందన్నారు.