రామాపురం మండలం సుద్దమళ్ళ గ్రామం ఓబుల్ రెడ్డి గారిపల్లిలో ఆలయ కమిటీ కోరిక మేరకు అవధూత నారాయణ స్వామి వారి 76వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిగా బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారికీ ఆలయ అధికారులు పూర్ణకుంబంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించి తీర్ద ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.