కడప జిల్లా ఎస్. పి హర్షవర్ధన్ రాజు ఆదేశాలమేరకు జిల్లాలోని విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేలా పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదిగేలా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మహిళా పి. ఎస్ సి. ఐ ఎం. కృష్ణా రెడ్డి విద్యార్థులకు సూచించారు.