కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు పద్మావతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పలు విభాగాలను పరిశీలించి, NICUలో పుట్టిన శిశువుల ఆరోగ్య పరిస్థితిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించి అధ్యాపకులతో చర్చించారు.