ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిశితంగా పరిశీలించాలని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖామంత్రి మంగళగిరిలోని సీసీఎల్ఏ ఆఫీసు నుండి ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించమన్నారు. జెసి అదితి సింగ్, అధికారులు పాల్గొన్నారు.