విద్యార్థులలో ఉత్తమ మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేశ్ అన్నారు. శుక్రవారం కడప నగరంలోని గాంధీనగర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల అభ్యున్నతి కోసం పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, టై, షూ, డిక్షనరీతో కూడిన కిట్టు పంపిణీకి శ్రీకారం చుట్టడం సంతోషకరమని అన్నారు.