పెంచాలనుకుంటున్న కరెంటు చార్జీలను ఉపసంహరిచుకోవాలని కడప కార్పొరేటర్ పాకా సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తరపులో ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాము అని చెప్పి అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా కూడా వాటిని అమలు పర్చకుండా ఉండడం చాలా బాధాకరం అని అన్నారు.