కడప శిల్పారామంలో ఈనెల 11వ తేదీ శనివారం మహిళలకు చుక్కల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలలో పాల్గొను మహిళలు శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శిల్పారామంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 8886652038, 8886652058 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.