మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే. నాగేశ్వరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో పులివెందులకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి, 8న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు.