కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు మరియల్, తదితరులు పాల్గొన్నారు.