చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్

79చూసినవారు
చెట్టును ఢీకొన్న స్కూల్ వ్యాన్
కమలాపురం నియోజకవర్గపరిధిలో స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కమలాపురం మండల పరిధిలోని జంగంపల్లె వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కోగా కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్