నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సూచించారు. శుక్రవారం కమలాపురం నియోజకవర్గ అభివృద్ధి, రైతు సమస్యలే ఎజెండాగా ఆర్డీవో, ఇతర అధికారులతో ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పాల్గొన్నారు. తప్పులు చేసిన వారెవరైనా చర్యలకు వెనకాడవద్దని స్పష్టం చేశారు.