బాలతిమ్మయ్యగారిపల్లె: నీటి సంపులో పడి కవలలు మృతి

77చూసినవారు
బాలతిమ్మయ్యగారిపల్లె: నీటి సంపులో పడి కవలలు మృతి
చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లె సమీప మామిడితోటలోని నీటి సంపులో ఇద్దరు కవల పిల్లలు మునిగి మరణించారు. మైదుకూరు మండలం లక్ష్మీపల్లెకు చెందిన రాముడు, లక్ష్మణుడుల తండ్రి మరణించగా తల్లి వదిలేసిపోయింది. కమలాపురంలో నాయనమ్మ వద్ద ఉంటున్న వీరు సెలవుల నిమిత్తం మేనమామ ఇంటికి వచ్చారు.  ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయారు. అర్ధరాత్రి మృతదేహాలు గుర్తించి వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్