కమలాపురం పట్టణంలోని దర్గా-ఏ-గప్పారియా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీల్లో ప్రొద్దుటూరు వెంకట సాయి భవిత్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. రెండవ స్థానంలో నంద్యాల జిల్లా బోరెడ్డి నారాయణరెడ్డి, మూడవ స్థానంలో దువ్వూరు మండలం దాసరి పల్లె అశోక్, నాలుగవ స్థానం కమలాపురం జంగంపల్లి పుత్తా నాగ సుబ్బారెడ్డికి చెందిన ఎద్దులు నిలిచాయని తెలిపారు.