బరకాయలకోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీకి చెందిన రైతు ఇక్కుల రాజన్న (56) మృతి చెందారు. టమాటల లోడుతో వెళ్ళిన టెంపోను ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఇనుప పైపులు టెంపోపై పడిపోయాయి. ఈ ఘటనలో రైతు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.