అంతర విశ్వవిద్యాలయ పోటీలలో వైవియూకు కాంస్య పతకం

73చూసినవారు
అంతర విశ్వవిద్యాలయ పోటీలలో వైవియూకు కాంస్య పతకం
యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన రేఖా మోని అంతర విశ్వవిద్యాలయ పోటీలలో కాంస్య పతకాన్ని బుధవారం సాధించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న దక్షిణ, పశ్చిమ భారత అంతర విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన రేఖా మోని 45 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఆమె సిఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్ఎం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బిఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

సంబంధిత పోస్ట్