చెన్నూరులోని భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీకి పాల్పడి రూ. 20 వేలు నగదు దోచుకు వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి, తాలూకా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తులసి నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో క్లూస్ టీం విచారణ చేపట్టింది. బ్యాంకులో పరిశీలించడంతో పాటు అక్కడ పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.