ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసడర్లుకు అందజేసి పంచాయతీకి సహకరించాలని చెన్నూరు డిప్యూటీ ఎంపీడీవో సురేష్ బాబు అన్నారు. గురువారం కొక్కరాయపల్లి గ్రామ పంచాయతీలో ప్రజలకు, ఉపాధి కూలీలకు తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటించి చెత్త సేకరణ గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.