చెన్నూరు: భూసార పరీక్షలతో అధిక దిగుబడి

52చూసినవారు
చెన్నూరు: భూసార పరీక్షలతో అధిక దిగుబడి
భూసార పరీక్షలు నిర్వహించుకోని వ్యవసాయం చేయడంతో అధిక దిగుబడి వస్తుందని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వీరయ్య అన్నారు. బుధవారం చెన్నూరు మండలం బయనపల్లి, రామనపల్లిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త రత్నాకుమార్ రైతులకు ఖరీఫ్ పంట కాలంకు సంబంధించి సలహాలు అందజేశారు. ఏవో శ్రీదేవి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్