లేగ దూడలకు సీజనల్ టీకాలు వేయించాలని కడప డిఏహెచ్ శారదమ్మ అన్నారు. శనివారం చెన్నూరు మండలం నర్సారెడ్డి పల్లెలో కడప ఏపీఎల్డీఎ సౌజన్యంతో లేగ దుడల ప్రదర్శన నిర్వహించారు. పశుపోషణపై యజమానులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడి శ్రీనివాసన్ రెడ్డి, స్థానిక పశువైద్యులు ఉపేంద్ర, పలువురు పశు వైద్యులు, రైతులు పాల్గొన్నారు.