వైసిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి చెన్నూరు మండల యువజన విభాగం అధ్యక్షులుగా పేరుసాముల నిత్య పూజయ్య, ఉపాధ్యక్షులుగా పాత కుంట కార్తీక్ రెడ్డిలు నియమితులయ్యరు. ఈ సందర్భంగా వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ తమను నమ్మి తమకు ఇచ్చిన యువజన విభాగంకు సంబంధించిన పదవులకు న్యాయం చేస్తామని, మండలంలో వైసిపి బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.