చెన్నూరు: 'బాల్య వివాహాలను చేయడం, ప్రోత్సహించడం నేరం'

84చూసినవారు
చెన్నూరు: 'బాల్య వివాహాలను చేయడం, ప్రోత్సహించడం నేరం'
తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా అరికట్టాలని చెన్నూరు ఐసీడీఎస్ సూపర్ వైజర్ గుర్రమ్మ, మహిళా పోలీసులు సునంద, చంద్రకళ అన్నారు. చెన్నూరు ఒకటవ సచివాలయంలో కిశోర బాలబాలికల తల్లిదండ్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు కలుగుతాయన్నారు. బాల్య వివాహాలను చేయడం, ప్రోత్సహించడం నేరమని పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్