రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

69చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
పెండ్లిమర్రి మండల పరిధిలోని యోగి వేమన యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంలో విధులు నిర్వహించేందుకు వేంపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డికి గాయాలు అయ్యాయి. కడప కోర్టులో వేంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు కానిస్టేబుల్ గా శ్రీనివాసరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్