కమలాపురంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు సీఐ రోషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం నిర్వహించిన వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా హాజరైన సిఐ రోషన్ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఆదినిమ్మాయ పల్లె, పుష్పగిరిలో కమలాపురం సిబ్బంది రెస్క్యూ పనితీరు అభినందనీయం అని సీఐ రోషన్ తెలిపారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కరపత్రాలను సీఐ రోషన్ విడుదల చేశారు.