ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కడప జిల్లా రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. శుక్రవారం కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సి. సూర్యారావు ఆధ్వర్యంలో సంఘం సభ్యురాలు డాక్టర్ పెద్దిరెడ్డి నీలవేణి, తెలుగు అధ్యాపకులు మార్తల శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో కవితా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.