సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానన్న చంద్రబాబు సంపద సృష్టి లేదని తేటతెల్లమైంది అని కమలాపురం వైయస్సార్ సిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి అన్నారు. శనివారం కమలాపురం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అప్పు చేసి పథకాల అమలు చేస్తోందని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇవాళ తల్లికి వందనం పథకం అమలు కు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది నిజం కాదా.? అని ప్రశ్నించారు.