కమలాపురం టిడిపి కార్యాలయంలో రైతులకు తొమ్మిది జతల ఎద్దులను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి పంపిణీ చేశారు. శనివారం ఏపీఎల్ డిఏ పథకం కింద మంజూరైన 9 జతల ఎద్దులను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. ఈ పథకం కింద 9 జతలు రైతులకు అందేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రైతుల క్షేమం కొరకు కృషి చేస్తున్నారని తెలిపారు.