జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో కమలాపురం పోలీసులు పట్టణంలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. సోమవారం కమలాపురం సీఐ రోషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్, అనుమానిక ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలు ఇంటి నుండి ఊర్లకు వెళ్లే సమయంలో బంగారం, నగదు ఇంట్లో ఉంచుకోవద్దని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.