కమలాపురం: ఘనంగా మట్టల పండగ

74చూసినవారు
కమలాపురం: ఘనంగా మట్టల పండగ
కమలాపురం నగర పంచాయతీలో గుడ్ ఫ్రైడేకి ముందుగా వచ్చే ఆదివారం క్రైస్తవ సోదరులు మట్టల పండుగను నిర్వహించుకున్నారు. కమలాపురంలోని సిఎస్ఐ టౌన్ చర్చి లోచర్చిలో రెవరెండ్ యు. సాల్మోన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా పండుగను నిర్వహించారు. ఈత మట్టలు చేత పట్టుకొని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు గీతాలను ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకున్నారు. సాల్మోన్ బాబు క్రీస్తు బోధనలు ప్రకటించారు. సిఎస్ఐ టౌన్ చర్చి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్