యువత ఆరోగ్యంతో పాటు ఆత్మ విశ్వాసంతో ఉండటానికి క్రీడలు ఆడటం అవసరమని కమలాపురం డిప్యూటీ తహశీల్దార్ రోసీనా హుస్సేన్, సిఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వాలీబాల్ పోటీలు కమలాపురంలో నిర్వహించారు. నెహ్రు యువ కేంద్ర జిల్లా యువ అధికారి మణికంఠ, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.