రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కమలాపురం నూతన ఎంపీడీవో గౌస్ బాషా అన్నారు. శనివారం ఆయన కమలాపురం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జిల్లాలో జరిగిన బదిలీల్లో భాగంగా కమలాపురంలో ఎంపీడీవో గా పని చేస్తున్న జ్యోతి బదిలీపై వెళ్లారు. ఈ మేరకు గౌస్ బాషా కమలాపురం ఎంపీడీవో గా బదిలీపై వచ్చారు. ప్రజలకు, లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పై కృషి చేస్తానన్నారు.