వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కమలాపురానికి చెందిన మైనారిటీ యువ నాయకుడు ఇస్మాయిల్ నియమితులయ్యారు. తనను ఆపదవికి ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి, కమలాపురం ఇంఛార్జ్ నరేన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇస్మాయిల్ మాట్లాడుతూ తాను శక్తివంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.