యువత, విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కమలాపురం సిఐ రోషన్ తెలిపారు. మంగళవారం ఉదయం కమలాపురం పరిధిలోని బీడీ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో సోదాలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలైన గంజాయి, మాట్కా, జూదం తదితర వాటిపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి అని అన్నారు.