అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన ఆహారం అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటానని ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలత అన్నారు. బుధవారం శ్రీలత సిడిపివోగా బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా కమలాపురంకు బదిలీపై వచ్చారు. గర్భవతులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా అంగన్వాడీ కేంద్రాలలో సమస్యలు, అవకతవకలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.