క్రిమిలేయర్ విధానం ద్వారా రిజర్వేషన్ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తే అప్పుడు కచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చినవారవుతారని సీఎస్ఎస్ఆర్ & ఎస్ఆర్ఆర్ఎం కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కళాశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతిని నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో చేపట్టారు. విద్యార్థులు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని, ఉన్నత స్థితికి చేరాలని తెలిపారు.