కమలాపురం మండల పరిధిలోని చదిపిరాళ్ల గ్రామం వద్ద శనివారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనగా అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. మృతుడు కమలాపురం రాంనగర్ కాలనీకి చెందిన ముద్దల బాలాజీ (29) గా గుర్తించారు. సిమెంటు ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.