పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూస్తున్నామని కడప జిల్లా టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ భాష అన్నారు. శుక్రవారం కమలాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 13 వేలు నగదు జమ చేస్తున్నదని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు నగదు జమ కావడంతో తల్లిదండ్రుల ముఖంలో ఆనందం కనబడుతున్నదన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.