కమలాపురం పట్టణంలోని బాలల ఉన్నత పాఠశాల వద్ద కుప్పూరువారి పల్లెకు చెందిన గొర్ల మందపై శుక్రవారం రాత్రి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. ఇవాళ రాత్రి జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నాలుగు గొర్రెలు మృతి చెందగా మరో 7 గొర్రెలు గాయపడ్డాయి. ప్రమాదంలో దాదాపు రూ. లక్ష నష్టం జరిగినట్లు గొర్రెల యజమాని తెలిపారు.