యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలు జులై 14 వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వైవియు పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన తెలిపారు. బీఈడీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులకు అలానే ఎంఈడి రెండు, నాలుగు సెమిస్టర్ల సప్లిమెంటరీ, రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.