పెండ్లిమర్రి మండల పరిధిలోని పులివెందుల కడప ప్రధాన రహదారి కొత్త గంగిరెడ్డిపల్లె వద్ద శుక్రవారం కారు టైరు పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. చక్రాయపేటకు చెందిన వేణుగోపాల్ రెడ్డి కడప నుంచి వేంపల్లి వైపుకు ప్రయాణిస్తున్న కారు టైరు పంచర్ కావడంతో ప్రమాదానికి గురైంది. దీంతో వేణుగోపాల్ రెడ్డి గాయపడ్డాడు. స్థానికులు చికిత్స కోసం అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.