వైయస్సార్సీపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శిగా కమలాపురం నియోజకవర్గం చెన్నూరు చెందిన చీర్ల సురేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనను ఆ పదవికి ఎంపిక చేసిన మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం ఇంఛార్జ్ నరేన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.