వైవీయూ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా తప్పెట రామప్రసాద్ రెడ్డి

85చూసినవారు
వైవీయూ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా తప్పెట రామప్రసాద్ రెడ్డి
యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ గా వైవీయూ తెలుగు విభాగం ఆచార్యులు తప్పెట రామప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి మంగళవారం ఆయనకు నియామకం పత్రం అందజేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఎస్. రఘునాథరెడ్డి రిలీవ్ అయి ప్రధానాచార్యులుగా కొనసాగనున్నారు. తప్పెట రామప్రసాద్ రెడ్డికి 30 ఏళ్ల సుదీర్ఘమైన బోధనానుభవం ఉంది.

సంబంధిత పోస్ట్