ఈనెల 21వ తేదీన సోమవారం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వల్లూరు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించవలసి ఉండగా ఈస్టర్ పండుగ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం 21వ తేదీకి పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.