వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ పుష్పగిరి క్షేత్రానికి వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల మహిళ భక్తుల దుస్తులు మార్చుకోవటానికి ఎటువంటి తాత్కాలిక, శాశ్వత ఏర్పాట్లు లేక ఇబ్బంది పడుతున్నారని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం తెలిపారు. పవిత్ర పర్వదినాలలో మహిళా భక్తులు పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని పెన్నా నదిలో స్నానమాచరించటానికి, పిండ ప్రధానం చేయటానికి వస్తుంటారన్నారు.