ప్రజలు చోరీలపై అప్రమత్తంగా ఉండాలని కమలాపురం ఎస్సై విద్యాసాగర్, వల్లూరు ఎస్సై పెద్ద ఓపన్న అన్నారు. బుధవారం వల్లూరు మండలం గణేష్ పురంలో నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ మహిళలు ఒంటరిగా పశువుల మేతకు వెళ్లేటప్పుడు బంగారు నగలను ధరించవద్దని సూచించారు. ఇంటిలో బంగారు, నగదు ఉంచుకోకుండా బ్యాంకులో ఉంచుకోవాలని సూచించారు. అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు.