వల్లూరు: కేజీబీవీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

53చూసినవారు
వల్లూరు: కేజీబీవీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్
వల్లూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న హాస్టల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిలతో సమావేశమై బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏపీసీ, సెక్టోరియల్ అధికారులు, మండల అధికారులు, ప్రిన్సిపల్ నశీమున్నిషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్