రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అభివృద్ధి ప్రభుత్వం అని వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం వల్లూరు టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం గడిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలనలో ఉందని 30 సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.